నిన్న మొన్నటి దాకా జిల్లా లో కరోనా భయo తో వనికిపోతున్న ప్రజలకు ఇప్పుడు కుక్కలకు వచ్చిన వింత వ్యాధి తో రోజురోజుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకున్న పరిస్థితి నెలకొంది. కుక్కలు(శునకాలు) సైతం వింత వ్యాధులతో మృతి చెందడంతో ప్రజలు మరింత భయబ్రాంతులకు గురవుతున్నారు. భీమారo మండలం లో అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొందని , గ్రామంలో వీధి కుక్కలు ఎక్కడిక్కడే కుప్పకూలుతున్నాయని
ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గత కొన్ని రోజులుగా మంచిర్యాల – చెన్నూర్ జాతీయ రహదారి పై ఉంటున్న కుక్కలు వాటికి వింత రోగం సోకడం తో బలహీనంగా మారి కూర్చున్న కుక్కలు అలానే చనిపోతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సుమారుగా రోజు రెండు కుక్కులు మరణిస్తూన్నట్లు గ్రామాస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలకు కూడా కరోనా వచ్చిందా? అని ఆందోళన చెందుతున్నారు. భీమారo మండల వ్యాప్తంగా కుక్కలకు ఇలానే వింత వ్యాధి సోకుతుండటం ప్రజలు ప్రాణాలు అర చేతిలో పట్టుకొని బ్రతుకుతున్నారు. కుక్కలకు వింత వ్యాధితో వాటి ఒంటిపై ఉన్న చర్మం లేచిపోవడంతో పాటు ,నోటి నుండి సోళ్లు ను కక్కుతున్నాయి. ఒక్క మండల కేంద్రంలోనే దాదాపు 10 లో 9 కుక్కులు అలానే వింత వ్యాధితో బలహీనంగా మారడం గమనార్హం.
అధికారుల చర్యలు కరువు
కుక్కలు ఇలా గ్రామాల్లో తిరుగుతున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పట్టించుకోవాలిసిన ఆ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం తో గ్రామాల్లో ఉన్న ప్రజలకి కూడా ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన కు గురికావాలిసి వస్తుంది.