వారు ఆదర్శవంతులు, నిరుపేద ఆడ బిడ్డలకు అండగా నిలుస్తున్నారు

వారు ఆదర్శవంతులు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ నిరుపేద ఆడ బిడ్డలకు తోడై అండగా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా బాల్క పౌండేషన్ ఆధ్వర్యంలో జైపూర్ మండలం లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాక యువకులకు అండగా నిలుస్తున్నారు.ఆ యువ జంట జైపూర్ మండల జడ్పిటిసి మేడి సునీత – తిరుపతి లు కలిసి నిరుపేద కుటుంబంలో ఉన్న యువతులకు భారీ మొత్తంలో సహాయ సహకారాలు అందిస్తూ మండలంలో సేవలందిస్తు మండల ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు.
వారు నిరుపేద కుటుంబాల యువతులను గుర్తించి వారికి ఆర్థికంగా బాసటగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో ఆదివారం ఇందారం గ్రామానికి చెందిన ఫిరోజ్ ఖాన్ కుమార్తె వివాహానికి బాల్క పౌండేషన్ ద్వారా చీర ,సారెతో పాటు ఆర్థికసాయం అందజేశారు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన 20 మంది యువకులకు టీ షర్ట్ లు , బ్యాట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడి రవి సైతం పాల్గొంటున్నారు.