కుక్కలకు వింత వ్యాధి సోకి ప్రజలకు ఇక్కట్లు కథనానికి స్పందన

  • పశు వైద్యశాలలో సమావేశం అయిన ఎంపిడివో శ్రీనివాస్ ,ఎంపీవో శ్రీపతి బాపు , సర్పంచ్ గద్దె రాo రెడ్డి

మంచిర్యాల జిల్లా భీమారo మండలం లో కుక్కలకు వింత వ్యాధి ప్రజలకు ఇక్కట్లు అనే కథనo ‘మహా వెలుగు’ ఆదివారం ప్రచురించగా స్పందించిన వెటర్నరీ డాక్టర్ రాకేష్ శర్మ సోమవారం ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపిఓ శ్రీపతి బాబురావు , స్థానిక సర్పంచ్ గద్దె రాoరెడ్డి తో కలిసి పశు వైద్యశాల లో సమావేశం ఏర్పాటు అయ్యారు. ఈ సందర్భంగా రాకేష్ శర్మ మాట్లాడారు… కుక్కలకు వింత వ్యాధి సోకింది వాస్తవమేనని వాటిని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎక్కడైనా అడవిలో దూరంగా గా విడిచిపెట్టి వస్తారని అదేవిధంగా పెంచుకునే కుక్కలను పశు వైద్యశాలకు తీసుకు వస్తే వాటికి మెరుగైన వైద్యం అందిస్తామని వారు తెలిపారు. మండలంలో సర్పంచులు గమనించాలన్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఉందని ప్రతి గ్రామంలో కుక్కలను వేరే చోటుకు తరలించేందుకు గ్రామపంచాయతీ ప్రయత్నాలు చేయాలని వారు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు. తెలిపారు. కుక్కలను తరలించే వారికి సహకరించాలని వారు పిలుపునిచ్చారు. గ్రామంలో కుక్కలను దూరంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.