శివనామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాల

  • ఆసిఫాబాద్ లో ముగ్గురు గల్లంతు

తెలంగాణ రాష్ట్రం : తెలుగు రాష్ట్రాల్లో ని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున నుంచి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. శివుడికి రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. జాతర సందర్భంగా మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలోపెద్ద పట్నం నిర్వహిస్తున్నారు.

ఏపీ లోని శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు నిండిపోయాయి. పాతాళ గంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పాతాళ గంగలో నీటిమట్టం తగ్గడంతో స్థానానికి ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరో ప్రముఖ క్షేత్రం కోటప్పకొండ లో మహాశివరాత్రి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరుగుతుంది. కోటీశ్వరుడికి తొలి పూజలు తిరునాళ్ళు ప్రారంభం అయింది.

జైపూర్ మండలం వేలాలో మల్లన్న జాతర కు ఇప్పటికే అధిక మంది భక్తులు తరలివస్తున్నారు. ఈరోజు కొండపై భక్తులు వచ్చి మల్లన్న దేవుని కి బోనాలు సమర్పించుకుoటున్నారు. ఇప్పటికే అధికారులు మంగళవారం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో జైపూర్ ఏసీపీ నరేందర్ ముందుగానే పరిశీలించి ఐదు సెంటర్లు గా పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ , గుట్టపై ,ఆలయం , గుట్ట కింద , గోదావరి నది వద్ద ,రూట్లలో జైపూర్ ఏసిపి నరేందర్ , శ్రీరాంపూర్ సిఐ రాజు ,ఎస్సై రామకృష్ణ , నేతృత్వంలో 10 మంది సీఐలు 29 మంది ఎస్ఐలు 700 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పటిష్టం చేస్తూ 40 సిసి కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు.

వేలాల జాతరకు 25 ప్రత్యేక బస్సులు

జైపూర్ మండలం ఈ వేలాల మహాశివరాత్రి జాతర కు మంచిర్యాల ఆర్టిసి డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు డిపో మేనేజర్ మల్లేశం తెలిపారు. చెన్నూరు నుంచి వేలాకు ఐదు బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇక్కడికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆలయాన్ని దర్శించుకొనున్నారు.

మంచిర్యాల జిల్లా లోని మల్లన్న బుగ్గ రాజా రాజేశ్వర ఆలయం , చెన్నూరు శివాలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. చెన్నూరులో ప్రజలు గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గూడెం పరిసర ప్రాంతాల్లో భక్తులు సమీపంలోని గోదావరి నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా లో సైతం భక్తులు ,ఆలయాల వద్ద బారులు తీరారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కుంటాల జలపాతం వద్ద సహజసిద్ధంగా ఏర్పడిన గుహలో శివలింగం నందీశ్వరుడిని దర్శించుకోవాలని భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా రెండు రోజులపాటు దర్శనానికి వీలు ఉంటుంది. రాష్ట్రం లోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన కుంటాల జలపాతం వద్ద సహజసిద్ధంగా ఏర్పడిన సోమేశ్వరాలయంలో శివలింగం నందీశ్వర విగ్రహాలకు అభిషేకం తో పాటు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కాలేశ్వరం లో

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మరో పుణ్యక్షేత్రం కాలేశ్వరంలో ఈ శివాలయానికి భక్తులు తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , మధ్యప్రదేశ్ ప్రాంతాలనుండి ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తుంటారు.

ఆసిఫాబాద్ లో పుణ్య స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు

ఆసిఫాబాద్ జిల్లాలో గోరo విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానానికి వెళ్లి సిర్పూర్ మండలం అలోనవెళ్లి వద్ద ప్రాణహిత నది లో ముగ్గురు గల్లంతయ్యారు. తల్లి పద్మ ,కుమారుడుతో పాటు మరో మహిళ గల్లంతయింది. ఆ మహిళను గుర్తించిన స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.