ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటానని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. స్థానిక టిఆర్ఎస్ నాయకులు పోడేటి రవికి రోడ్డు ప్రమాదంలో గత కొన్ని రోజుల క్రితం గాయాలు కాగ వారిని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గద్దె రాంరెడ్డి , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్ , మాజీ జెడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్ , నాయకులు రాజేశ్వర్ రెడ్డి , వేముల శ్రీకాంత్ గౌడ్ , బండి సంపత్ , జనంపల్లి సమ్మయ్య , మద్దిశంకర్ ,ఆతుకూరి మధు , వడ్ల కొండ కిష్టయ్య , రాం వేణు , జలంపల్లి తిరుపతి , బుఖ్య లక్ష్మన్ , వడ్ల కొండ పవన్ తదితరులు పాల్గొన్నారు.
