మందమర్రి : ఈ నెల 4 న మందమర్రి మున్సిపాలిటీ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వైద్య -ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రానుండగా ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ,బుధవారం మందమర్రి పట్టణంలో ని టిఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తలకు దిశ -నిర్దేశం చేశారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ రామకృష్ణపూర్ పట్టణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో విప్ సుమన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడుగా నియమితులు కాగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేణి కుంట్ల ప్రవీణ్ , వైస్ ఎంపీపీ రాజు ,నాయకులు జె. రవీందర్ ,మద్దిశంకర్ ,రాంవెను ,మహిళ నాయకురాళ్లు మంచాల మంజుల , జారిన ,సుజాత ,స్వరూప ,ప్రమీల ,లలిత , తదితరులు పాల్గొన్నారు.