మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో గత రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరుగగా అందులో బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన తెలిసిందే ,ఆ ప్రమాదం నుండి ఇద్దరు యువకులు బయటపడగా ఒకరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ధరావత్ రవికి తీవ్రగాయాలు కాగా కరీంనగర్లో ఉన్న సేవ్ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. దీని గాను ఇప్పటికే రూ. 250000 ఖర్చు అయినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తాము పేద కుటుంబం అని తమని ఆదుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు అండగా నిలిస్తే ఒక్క నిండు ప్రాణం బ్రతుకుతుందని వారు తెలుపుతున్నారు. దాతలు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. ధరావత్ రవి గత కొంత కాలంగా టిఆర్ఎస్ పార్టీలో యాక్టి గా పని చేస్తున్నాడు. రవి కి సహాయం చేయవలసిన వారు ఫోన్ పే /గూగుల్ పే నంబర్ – 95 53 34 23 06 కు సహాయం అందించాలని కోరుతున్నారు.