హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేకుండా గాంధీ ఉస్మానియా స్థాయి వైద్యం ఇక్కడ అందిస్తామని మారుమూల ప్రాంతాలు సైతం వైద్య సేవల కొరత లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ లో రూ.60 కోట్లతో 300 పడకల జిల్లా ఆస్పత్రికి రూ. 70 లక్షలతో రేడియాలజీ ల్యాబ్ ఏర్పాటుకు అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, టిఎస్ఎంఏస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ , ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు ,కోనేరు కోనప్ప ,జెడ్ పి చైర్మన్ కోవ లక్ష్మి ,తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవికావు , వాన కాలం వస్తే డయేరియా , అంటురోగాలు ఉండేవి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవని వారు పేర్కొన్నారు. వైద్యం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల ,ప్రజల కోరిక మేరకు కాగజ్నగర్ ,ఆసిఫాబాద్ లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. రూ. 20 లక్షలతో 7 చోట్ల సబ్ సెంటర్ల బిల్డింగ్స్ ఏర్పాటుకు నిధులు మంజూరు. చేస్తామని రోడ్లు వేసేందుకు ప్రత్యేక నిధిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారని వారు సూచించారు. 60 ఏళ్ల పాలనలో కేవలం మూడు మెడికల్ కాలేజ్ల్ మాత్రమే ఉంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత 17 పెంచుకున్నామని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో లో అన్ని గూడెంలను పంచాయతీలు చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని దీనివల్ల 3146 మంది గిరిజనులు సర్పంచులు అయ్యారని పాలనలో భాగస్వామి అయ్యారని వారు తెలిపారు.