పందెం కోళ్ల స్థావరం పై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

  • 27 సెల్ ఫోన్స్
  • ఐదు పందెం కోళ్ళు
  • 7 ఫోర్ విల్లర్ వాహనాలు రూ. 1లక్ష 50 వేలు
  • తో పాటు 20 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్

తెలంగాణ రాష్ట్రం మహా వెలుగు : మంచిర్యాల జిల్లాలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి చేసింది. టాస్క్ ఫోర్స్ సిఐ మహేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ లో రహస్యంగా పొదల చాటున నిర్వహిస్తున్న పందెం కోళ్ల స్థావరంపై టాస్క్ ఫోర్స్ శుక్రవారం రాత్రి సమయంలో దాడి చేసింది పెద్దపెల్లి జిల్లా మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో చెందిన వారు ఉండగా వారి నుండి రూ.1 లక్ష 50 వేలు , 27 సెల్ ఫోన్స్ , 5 పందెం కోళ్లు , 7 ఫోర్ విల్ వాహనాలు తో పాటు 20 మంది వ్యక్తులను అదుపులోకి తీసునట్లు వారు తెలిపారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించనున్నట్లు వారు తెలిపారు. ఈ పందెం రాయుళ్లు మహారాష్ట్ర తో పాటు ఇటు తెలంగాణ లో ఆడుతున్నట్లు సమాచారం.ఈ దాడుల్లో ఎస్ఐ లచ్చన్న , సిబ్బంది సంపత్ , భాస్కర్ గౌడ్ ,శ్రీనివాస్ , రాకేశ్ ,శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.