మంచిర్యాల జిల్లాలో సంబరాలు

మంచిర్యాల జిల్లాలో టిఆర్ఎస్ నాయకుల సంబరాలు అంబరాన్నంటాయి. కెసిఆర్ ఉద్యోగుల పై ప్రకటన చేయడంతో జిల్లావ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. దీనిలో భాగంగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఐబీ వద్ద టిఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.