సీసీ కెమెరాలు సరిగ్గా పని చేస్తున్నాయా …! ఎలా పని చేస్తున్నాయి … ? అని ఎస్ఐ అశోక్ బ్యాంక్ మేనేజర్ ను అడిగి తెలుసుకున్నారు. భీమారం బ్యాంకు ను గురువారం సందర్శించి ఆయన, ఇటీవల బ్యాంక్ దొంగతనాలు ఎక్కువ గా జరుగుతున్న నేపథ్యంలో బ్యాంక్ ను ఎస్ఐ అశోక్ సందర్శించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయి, సక్రమంగా పనిచేస్తున్నాయ..? అని బ్రాంచ్ మేనేజర్ డేవిడ్ ను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు మేనేజర్ డేవిడ్ తో కలిసి బ్యాంక్ ఆవరణలో మరియు బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అత్యవసర ఈ పరిస్థితులలో మోగే అలారం సిస్టం పనితీరు మరియు బ్యాంకులో పని చేస్తున్నటువంటి సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డ్ రూము వద్దకు వెళ్లి సైరెన్ వస్తుందో ? లేదో ? టెస్ట్ చేశారు. బ్యాంకులోని సీసీ కెమెరాలు 360 డిగ్రీలలో ఆ సీసీ కెమెరాలు పని చేస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ ఎస్సై కి తెలిపారు. అదేవిధంగా హైవే రోడ్డు ను కూడా సీసీ కెమెరాలు కవర్ చేస్తున్నట్లు మేనేజర్ ఎస్ఐ అశోక్ కు తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ రూమ్ లో నడుస్తున్న సీసీ కెమెరాలను ఫుటేజీలను ఆయన ముందస్తుగా పరిశీలించారు. బ్యాంకులో గాని, పరిసరాలలో కాని ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నట్లయితే తమరిని సంప్రదించవచ్చని ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఎస్సై గారు బ్యాంక్ మేనేజర్ గారికి తెలపడం జరిగింది. ఏదైనా సంఘటన జరిగితే స్థానిక పోలీస్ స్టేషన్ కు గాని , డయల్ 100 చేయాలని సూచించారు.