మంచిర్యాల జిల్లా : అనాధ ఆశ్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను తెలంగాణ జాగృతి యువజన విభాగం జిల్లా యూత్ అధ్యక్షులు మేడి శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి పిల్లలతో కేకు కట్ చేసి అనంతరం పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ… కష్టాల్లో ఉన్న వారికి నేనున్నా నంటూ అండగా నిలుస్తున్న కల్వకుంట్ల కవిత ఆయురారోగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ రావు , జైపూర్ మండల జాగృతి యూత్ అధ్యక్షులు కోర కొప్పుల మహేష్ గౌడ్ ,అధికార ప్రతినిధి కోర కొప్పుల శ్రవణ్ గౌడ్ ,నాయకులు నర్సపూరి రాజు ,ఎగ్గడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.