కన్నెపల్లి తాసిల్దార్ కార్యాలయంలో దారుణ హత్య

మంచిర్యాల జిల్లా : కన్నె పల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఒక విఆర్ఏ దారుణహత్యకు గురయ్యాడు. మండలంలోని కొత్తపల్లి గ్రామ విఆర్ఏ గా విధులు నిర్వహిస్తున్న , దుర్గం బాబును గుర్తుతెలియని దుండగులు తాసిల్దార్ కార్యాలయం లోనే హత్య చేశారు. రక్తపుమడుగులో ఉన్న దుర్గం బాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ చేపట్టారు. కాగా బాబు తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో హత్యకు గురైనట్లు స్థానికులు తెలుపుతున్నారు. హత్య గల కారణాలు తెలియరాలేదు