ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
హైదరాబాదులో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమస్యలను సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అందులో భాగంగా మందమర్రి పట్టణంలో లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నూర్ లో పీజీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. చెన్నూరు పట్టణం లో నిరుపయోగంగా ఉన్న సింగరేణి కాళీ క్వార్టర్స్ ను తొలగించి , అక్కడ 44 ఎకరాల్లో పీజీ కళాశాల ఏర్పాటు చేస్తే కాగజ్ నగర్ , మంచిర్యాల , ఆసిఫాబాద్ , చెన్నూరు , బెల్లంపల్లి , ఆయా నియోజకవర్గ పరిధిలో గల విద్యార్థిని విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వారు సూచించారు. మందమరి లో డిగ్రీ కళాశాల చెన్నూరు లో పీజీ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల పేద దళిత విద్యార్థులకు సౌకర్యం సౌకర్యంగా ఉండి వారు ఉన్నత చదువులు చదవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సుమన్ అసెంబ్లీలో ప్రస్తావించారు.