ఎలా ఉన్నారు ? ఇప్పుడు ఆరోగ్యం బాగుందా

మహబూబాబాద్ జిల్లా, : ఎలా ఉన్నారు ? ఇప్పుడు ఆరోగ్యం బాగుందా ! అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అడిగి తెలుసుకున్నారు. కురవి మండలం, సిరోలు గ్రామంలో ఏకలవ్య గురుకుల బాలికల పాఠశాలలో కల్తీ ఆహారం తిని, నిన్న అస్వస్థతకు గురై మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆస్పత్రిలో చేరిన విద్యార్థినులను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.. మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ కి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా అధికారులు ఉన్నారు.