పైడిమల్ల నర్సింగ్ ఒక్క రౌడీ

మందమర్రి : పైడిమల్ల నర్సింగ్ అనే ఒక రౌడీషీటర్, బ్లాక్ మేల్ దందాలు చేస్తూ… రాజకీయాలను అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్న నువ్వు మద్దిశంకర్ గురించి మాట్లాడితే ఖబర్దర్ అని టిఆర్ఎస్ నాయకులు కాంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేశారు.

తల్లి పాలు తాగినోళ్ళం కాబట్టే వంచన,మతోన్మాదానికి దన్ను గా వున్న వివేక్ వైపు ఉండలేక ప్రజల వైపు,ప్రజా సంక్షేమం పరమావధి గా పని చేస్తున్న టీఆర్ఏస్ పార్టీ వైపు ఉన్నట్లు వారు తెలిపారు. కొన్ని ఏండ్ల తరబడి వివేక్ ను వాళ్ళ కుటుంబాన్ని నమ్మి ఎన్ని ఇబ్బందులను మద్ది శంకర్ ఎదుర్కొని నిలదొక్కుకున్నడో నీకేం తెలుసని ఆయన ప్రశ్నించారు.. మూడు ఐతారాలు ఐతలేదు నువ్వు రాజకీయం చెయ్యవట్టి నువ్వు మాట్లాడేటోనివా?మద్దిశంకర్ లేకుంటే వివేక్ కు ఛాయ్ బిస్కిట్లు ఇచ్చే గతి లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాంతంలో మద్దిశంకర్ వల్ల వివేక్ కు ఎంత పేరు వచ్చిందో కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసని మరిచి,సోయి తప్పి నీకు నువ్వు ఎక్కువ ఊహించుకొని పిచ్చి పిచ్చి మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు.

గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావని ఎద్దవా చేశారు. . వివేక్ ను గతంలో విమర్శలు చేసింది నువ్వు కాదా? నీకు చెన్నూరు మాల సోదరులు బుద్ది చెపుతారని చెప్పింది. నువు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు ఆ కుటుంబాన్ని వెనుకేసుకొస్తూ నీతులు చెప్తుంటే వినడానికి విడ్డురంగా ఉంది .నీ చెక్క భజన ఆపి నోరు అదుపులో పెట్టుకో…. ఇంకొకసారి టి ఆర్ ఎస్ పార్టీ కోసం కానీ టి ఆర్ ఎస్ నాయకుల కోసం కానీ పిచ్చి కూతలు కూస్తే మీ బీజేపీ నాయకులను తన్ని తరుముతo అని హెచ్చరించారు.