రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హోళీ రోజున విషాదం నింపింది ఆ గ్రామాన. ఓ వివాహిత తన ఇద్దరు చిన్న వయస్సులో ఉన్న పిల్లలతో కలిసి స్థానికంగా ఉన్న చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకుంది.
జిల్లాలోని గంబీరావు పేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం ఎవరికి తెలియకపోవడం దారుణంగా కనిపిస్తోంది. ఇద్దరు పిల్లలు చెరువు నీటిలో తేలడంతో అసలు విషయం బయటపడింది. చనిపోయిన పిల్లల్లో మూడు సంవత్సరాల బాబుతో పాటు 6 నెలల పాప కూడ ఉంది. అయితే తల్లి మృతదేహం మాత్రం బయటపడలేదు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, తల్లి మృత దేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. పెద్ద కారణం ఎం అయిన ఉందా కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య పూనుకున్నారా తెలియాల్సి ఉంది.
