మంచిర్యాల మహా వెలుగు : మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా తూముల నరేష్ ఎన్నికయ్యారు. ఏఐసీసీ సభ్యులు మాజీ MLC కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు మంచిర్యాల పట్టణ అధ్యక్ష ఫారం ను అందజేశారు. ఈ సందర్భంగా తూముల నరేష్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడమే తమ ఏకైక లక్ష్యమని తెలిపారు. రానున్నది కాంగ్రెస్ రాజ్యమని తెలిపారు. తమకు పదవీ ని ఇచ్చిన ప్రేమ్ సాగర్ రావు , సురేఖ కు ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాలలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు
