విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు

  • మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా జోరుగా గుడుంబా అమ్మకాలు
  • చోద్యం చూస్తున్న సంబంధిత అధికారుల-
  • మామూళ్ల మత్తులో సంబంధిత శాఖ అధికారులు

మహా వెలుగు 20: గత కొంత కాలంగా గుడుంబా అమ్మకాలు మంచిర్యాల జిల్లాలో జోరందుకున్నాయి. సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్తూ పబ్బం గడుపుతున్నారు. మంచిరాల పరిధిలో ఉన్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గత కొంత కాలంగా గుడుంబాను పూర్తిగా నిషేధించింది. దీనిలో భాగంగానే పోలీసులు కార్డెన్ సర్చ్ తో గుడుంబా తీసే వారిని అమ్మేవారిని పూర్తిగా మార్చ సాగారు. ఇదే క్రమంలో కొందరికి లోన్ లు సైతం ఇచ్చే ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం చేసింది. దీనికి పోలీస్ అధికారులు ఎంతో తోడ్పాటును అందించారు.

తెలంగాణ ప్రభుత్వం గుడుoబా తీసే వారికి ఉపాధి కల్పించడంతో పాటు రుణాలను సైతం మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వ చర్యలతో గుడుంబా తీసేవారు అమ్మేవారు గణనీయంగా తగ్గిపోయారు.

జిల్లా వ్యాప్తంగా జోరందుకున్న గుడుంబా అమ్మకాలు

ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా గుడుంబా అమ్మకాలు జోర అందుకున్నాయి. ఎక్కడ చూసినా గుడుంబా తాగే వారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడనుంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం దుకాణం దారులను పట్టుకొని బెల్లం అమ్ముతున్నారని నెపంతో వారిని జిల్లాలో పలు తాసిల్దార్ కార్యాలయంల్లో బైండోవర్ చేస్తున్నారు. ఇలా బైండోవర్ చేస్తున్న కూడా గుడుంబా అమ్మకాలు ఇంకా జోరందుకున్నాయి. ఎక్సైజ్ అధికారులు మాత్రం కాగితాలలో చూపించేందుకు పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చేందుకు బైండోవర్ చేస్తున్నట్లు దుకాణదారులు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

బెల్లం అమ్మేవారిని విడిచిపెట్టి

బెల్లం అమ్మకాలు ,కొనుగోలు పెద్ద మొత్తంలో చేసేవారిని వదిలి పెడుతున్న అధికారులు చిన్న చిన్న దుకాణాల దారులను బైండోవర్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతా వారికి తెలిసిన ఏమి తెలియనట్టు మామూళ్ల మత్తులో జోగు తున్నారు.

జిల్లాలో ఈ మండలాల్లో జోరుగా గుడుంబా అమ్మకాలు

జిల్లాలో ఈ మండలాల్లో జోరుగా గుడుంబా అమ్మకాలు సాగుతున్నాయి. ఈ తతంగమంతా అధికారులకు తెలిసినప్పటికీ మామూలు పుచ్చుకొని పబ్బం గడుపుతున్నారు కోటపల్లి, భీమారం, నెన్నెల, రామకృష్ణాపూర్, చెన్నూరు, ఈ మండలాల్లో లో ఉన్న తండాలలో జోరుగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా జరుగుతున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఈ మండలంలోని గ్రామాల్లో గుడుంబా అమ్మకాలు ఏరులై పారుతున్నాయి. గుడుంబా తాగే వారి సంఖ్య గణనీయంగా మళ్లీ పెరిగిపోయింది. గతంలో ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ గత సంవత్సర కాలంగా సంబంధిత అధికారుల వైఫల్యంతో గుడుంబా అమ్మకాలు మళ్లీ జోరు గా కొనసాగుతున్నాయి.

అధికారులు ఏం చేస్తున్నట్టు

జిల్లా వ్యాప్తంగా గుడుంబా గుప్పుమంటున్న సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇంతకాలంగా లేని ఈ వ్యవహారం ఇప్పుడు కొనసాగుతుంది అంటే అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తుoడటoతో పాటు మామూళ్ల మత్తులో జోగు తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లు కట్టడి చేస్తారా? మామూళ్ల మత్తులో జోగుతారా ? చూడవలసి ఉంది.