ప్రేమ పావురాలకు కష్టం

  • హాలియా వద్ద సాగర్‌ కాలువలో దూకిన ప్రేమజంట

నల్గొండ మహా వెలుగు 21 : నల్గొండ జిల్లా హాలియా వద్ద
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. సాగర్‌ కాలువలోకి దూకి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కాల్వలో దూకిన ప్రేమ పావురాలను కాపాడేందుకు తాడును తీసుకువచ్చారు. తాడు సాయంతో యువతిని కాపాడారు. యువకుణ్ని కాపాడేలోగా.. అతను నీటిప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుడి కోసం ఈతగాళ్లను రంగంలోకి దింపారు._
ఈ ప్రేమ పావురాలది పీఏపల్లి మండల వాసులుగా పోలీసులు గుర్తించారు.