ఐక్యమత్యంతో హక్కులు సాధించుకుందాం

  • టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్

మహా వెలుగు ఆసిఫాబాద్ : జర్నలిస్టులు ఐక్యమత్యంతో ఉండి హక్కులు సాధించుకుందామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం (టీయూడబ్ల్యూజే -ఐజేయు)జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో టీయూడబ్ల్యూజే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యమత్యంగా ఉంటేనే ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లులు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లావ్యాప్తంగా చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ ,టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి అడప సతీష్, టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఎస్ వేణుగోపాల్, దేవునూరి రమేష్, సురేష్ చారి, పాత్రికేయులు మేకల శ్రీనివాస్, వారణాసి శ్రీనివాస్, మిలిన్ కుమార్, భీమ్ రావు, రాధా కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.