గంజాయి , మత్తు పదార్దాల నిర్మూలనకు సహకరించాలి

మహా వెలుగు జైపూర్ 21 : గంజాయి , మత్తు పదార్దాల నిర్మూలనకు సహకరించాలని శ్రీరాంపూర్ సిఐ రాజు పేర్కొన్నారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిగుంట గ్రామంలోని ఎస్సి కాలనీలో మహా సిద్ధి వినాయక బ్రిక్స్ కంపెనీ ఓనరు ప్రసాద్ సహకారం తో 6 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కాలనీలోని పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు.“గంజాయి మరియు మత్తు పదార్దాల నియంత్రణ పై అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహి౦చారు.

ఆనంతరం వారు మాట్లాడుతూ…. సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, ఉపాద్యాయులు, స్నేహితులు ఎప్పటికప్పుడూ వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లతే వాటి బారి నుంచి వారిని కాపాడ వచ్చన్నారు.ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగం అధికంగా కావడంలో నేడు ఇది సామాజిక సమస్యగా పరిగణించబడుతోందని. ఇలాంటి సామాజిక సమస్యను రూపుమాపడంతో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావల్సి వుంటుందని వారు తెలిపారు. ఇందులో భాగంగా ఎవరైన గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా ఎవరిలోనైనా ఉపాద్యాయులు గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు, సమాచారం అంధించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కావున గంజాయి రహిత ప్రాంతంగా గుర్తింపబడటంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు.
ఈ సందర్భంగా జైపూర్ పోలీసువారి చేయూతతో గ్రామ యువతకు వాలీబాల్ కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై రామకృష్ణ, గ్రామ నాయకులు గోదారి లక్ష్మణ్, శ్రీ రాములు, బ్రిక్స్ కంపెనీ ఓనరు ప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది, గ్రామ యువత, పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.