మొక్కల పై అవగాహన కలిగి ఉండాలి

మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 22 : మొక్కలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బేగంపేట సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని హార్టికల్చర్‌ ,పాలిటెక్నిక్‌ కాలేజీ విద్యార్థులకు అటవీ శాఖ బేగంపేట సెక్షన్‌ ఆఫీసర్‌ నర్సయ్య ఆధ్వర్యంలో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం పోతారం గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలో సెంటినరీకాలనీ హార్టికల్చర్‌ ,పాలిటెక్నిక్‌ కాలేజ్ విద్యార్థులకు మొక్కల పెంపకం, విత్తన శుద్ధి తదితర అంశాలపై వివరించారు. ఈకార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రభావతి తోపాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.