మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 22 : ఎమ్మార్పీ కంటే నిత్యావసర సరుకులు అత్యధిక ధరలు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని ఏసీపీ గిరి ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం ఏసీపీ గిరి ప్రసాద్ ఆదేశాల మేరకు రామగుండము సీఐ లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఎస్సై కుమార్ నమ్మదగిన సమాచారం మేరకు ఎఫ్సి ఐ రోడ్ లోని లక్ష్మి కిరాణ షాప్ లో తనిఖీ చేశారు కిరాణాషాపు యజమాని వేముల రాజమౌళి నూనె ప్యాకెట్ల మీద పాత రేటు రూ. 155 ని వైట్నెర్ తో చెరిపి వేసి వాటి స్థానం లో కొత్త రేటు రూ 200. గా మర్చి ప్రస్తుత ధరకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. కిరాణ షాపులో తనిఖీ లో దాదాపు 23 ఫార్చ్యూన్ కంపెనీ నూనె ప్యాకెట్ల పై పాతధరను చెరిపివేసి ఉన్నవి అట్టి ప్యాకెట్లను గుర్తించి వాటిని స్వాధీన పరుచుకుని వాటిని లీగల్ అండ్ మెటాలజి డిపార్ట్మెంట్ వారికి తదుపరి విచారణ నిమిత్తం అప్పగించడం జరిగిందని వారు తెలిపారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ప్రజలను మోసం చేసే ఇలాంటి వ్యక్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని రామగుండము సీఐ లక్ష్మి నారాయణ హెచ్చరించారు.
