రేపు జరుగబోయే విస్తృత స్థాయి సమావేశo ను విజయవంతం చేయండి : కోరుకంటి చoదర్

మహా వెలుగు పెద్దాపల్లి ప్రతినిధి 23: రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ అదేశాల మేరకు గురువారం మార్కండేయకాలనీలోని ఆర్ఆర్ గార్డెన్స్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు బుధవారం ఎమ్మెల్యే తెలిపారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ ఇంఛార్జి లు సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.