మహా వెలుగు సీసీ 22 : భీమారo మండల కేంద్రానికి చెందిన యువకుడు సీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘన బుధవారం సాయంత్రం సమయంలో నెలకొంది… స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… భీమారo మండల కేంద్రం లోని మాదన్న గూడెం కు చెందిన రామల్ల రాకేశ్ (29) వృత్తి రీత్యా జిరాక్స్ మిషన్స్ రిపేర్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో ద్విచక్ర వాహనo తో సిసి వద్ద మొదట టాటా ఏసీ వాహనం రాకేష్ ద్విచక్ర వాహనం ను డీ కొట్టగా డిసిఎం వాహనం ను తగిలాడు.. కాగ టాటా ఏసీ వాహనo నీళ్ల బాటిళ్ల లోడు తో వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను చూస్తే వివరాలు తెలుస్తాయని వారు తెలిపారు.
