గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యం

మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 24: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అంతర్గం పోలీసులు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, అంతర్గం ఎస్సై శ్రీధర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొంతమంది వ్యక్తులు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎల్లంపల్లి గ్రామం శివారు ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, అంతర్గం ఎస్సై శ్రీధర్, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఆది మధుసూదన్, లచ్చన్న లు తమ సిబ్బందితో ఎల్లంపల్లి వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ,ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి వివరాలు అడగగా వారి పేర్లు జాడి కిరణ్, గొర్రె హ్రితిక్ అని తెలిపారని వారు తెలిపారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద కవర్లలో ప్యాక్ చేయబడి 300 గ్రాముల గంజాయి (56 చిన్న చిన్న) ప్యాకెట్స్ లభించడం జరిగిందన్నారు. వారిని అదుపులోకి తీసుకొని దీనిని ఎక్కడ నుండి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, మీకు ఇది ఎక్కడ నుండి వచ్చిందని వివరాలు అడగగా ఈర్షద్ ఖాన్, సుభాష్ నగర్, ఆదిలాబాద్ అనే వ్యక్తి సరఫరా చేశారని నిందితులు తెలిపారు.వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపించడం జరిగిందన్నారు. 300 గ్రాముల (56) గంజాయి,ఒక మోటార్ సైకిల్స్, 02 సెల్ ఫోన్ స్వాధీన పరుచుకున్నట్లు పోలీస్ లు తెలిపారు.

నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి..

1) జాడి కిరణ్ S/o రాజయ్య, వయస్సు:19, Sc నేతకాని, ట్రాక్టర్ డ్రైవర్
R/o.ఆదిత్య స్కూల్ పక్కన, మురుమూర్. అంతర్గo, పెద్దపల్లి.

2) గొర్రె హృతిక్ S/o. నర్సయ్య,వయస్సు:20: Sc మన్నెపు,Occ: ట్రాక్టర్ లేబర్. R/o. ఆదిత్య స్కూల్ పక్కన మురుమూర్.అంతర్గo, పెద్దపల్లి.

ఈర్షద్ ఖాన్, 3-195, సుభాష్ నగర్, ఆదిలాబాద్ (ప్రధాన నిందితుడు గంజాయి సరఫరా చేసే వ్యక్తి పరారి లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.సిబ్బంది సంపత్ కుమార్, ప్రకాష్, మల్లేష్, శ్రీనివాస్, భాస్కర్,రాకేష్ పాల్గొన్నారు.