వందశాతం బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను సీజ్ చేస్తాం

  • శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి. రాజు

మహా వెలుగు,జైపూర్ 25 : వందశాతం బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లను సీజ్ చేస్తామని శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి. రాజు హెచ్చరించారు.శుక్రవారం జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారo జాతీయ రహదారి పై జైపూర్ ఎస్సై రామకృష్ణ , శ్రీరాంపూర్ సి.ఐ రాజు సిబ్బందితో కలిసి వాహన తనిఖీల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు మరియు సరైన వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు ఈ-చలన్ లు విధించి, ఫోర్ వీలర్స్ వాహనాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ స్టిక్కర్స్ ను తొలగించారు.


ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ…సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో బ్లాక్ ఫిల్మ్ వినియోగంలో ఎవరికీ ప్రత్యేక అనుమతి లేదంటూ స్పష్టంగా పేర్కొందని , మోటార్ వెహికల్ చట్టం ప్రకారం 70 శాతం క్లియర్‌గా కనిపించే విధంగా,అదే ఇరువైపులా 30% శాతం ఉండాలని వాహనదారులకు సూచించారు. ఎవ్వరైనా ఫోర్ విల్లర్లకు బ్లాక్ ఫిల్మ్ లను 30% శాతం కంటే ఎక్కువ వినియోగిస్తే మరియు నెంబర్ ప్లేట్ లేకుండా, లైసెన్స్, వాహనానికి సంబంధించి అన్ని ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే వారి వాహనాలు సీజ్ చేసి,వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామ‌ని సి.ఐ రాజు తెలిపారు.