తెలంగాణ జిల్లాలకు నవోదయ పాఠశాలలను మంజూరు చేయండి : ఎంపీ వెంకటేష్ నేత

మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 25 : ఈ రోజు పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు మంజూరు విషయంలో జాప్యం చూపిస్తుందని ఆందోళన చేపట్టారు. సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ….రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన జిల్లాలకు ,జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ పాఠశాలలు మంజూరు చేయాల్సి ఉంది కానీ నవోదయ పాఠశాలలు మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని అదేవిధంగా అటు ,రాజ్యసభలోనూ లోక్సభలోనూ తెరాస పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన కూడా పాఠశాలల మంజూరు విషయంలో జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస లోక్సభ సభ్యులు పాల్గొన్నారు.