ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆందోళన

మహా వెలుగు గోదావరిఖని 25 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం సింగరేణి వర్క్ షాపులో ఓ మహిళ పెట్రోల్ పోసుకొని ఆందోళన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత నెల రోజుల క్రితం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు స్వామిదాస్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ అధికారుల ముందే చెప్పుతో సదరు నాయకుడికి దేహశుద్ధి చేసిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడం సింగరేణి వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. విచారణ జరుగుతుండగానే తనపై దాడి చేసి కేసు వాపసు తీసుకోవాలని బెదిరింపులకు గురి చేస్తున్నాడని
సదరు మహిళ ఏకంగా వర్క్ షాప్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న కార్మికులు, అధికారులు అడ్డుకున్నారు. సదరు మహిళకు తోడుగా తోటి కార్మికులు గేటు ముందుకూర్చొని ధర్నా నిర్వహిo చారు