కరోనా వైరస్ కాలర్ ట్యూన్ త్వరలోనే బంద్: విజ్ఞప్తులతో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అదుపులోనే ఉన్న క్రమంలో కొవిడ్‌-19పై అవగాహన కోసం టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన ప్రీకాల్‌- ఆడియో ప్రకటనలు, కాలర్‌ ట్యూన్లు త్వరలో నిలిచిపోనున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కొవిడ్‌ ప్రీకాల్‌ సందేశాలను నిలిపి వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ ప్రీకాల్‌-ఆడియో ప్రకటనల కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్‌ మాట్లాడటం ఆలస్యమవుతోందని వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది.