అదుపు తప్పి లారీ బోల్తా… డ్రైవర్ కు తప్పిన ప్రమాదం

మహా వెలుగు పెద్దపల్లి 28 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమల పేట గ్రామంలో AP 15 TB 0159నంబర్ గల లారీ అదుపు తప్పి పొలంలో పడిపోయింది. అదృష్టవశాత్తు లారీ నడుపుతున్న డ్రైవర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు రైతులు డ్రైవర్ ను లారీ లో నుంచి కిందికి దించారు. లారీని జేసిబీ సహాయంతో పొలంలో నుండి తీశారు.