జిల్లా వ్యాప్తంగా మాడపగిలేలా ఎండలు

మహా వెలుగు పెద్దపల్లి 29 : పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి.మార్చిలోనే మాడపగిలేలా ఎండలు కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు,
ఉక్కపోత రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రానున్న వారం రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె. నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ 40
డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ ప్రతాపం ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటే ప్రజలు రక్షణ కవచాలు ధరించి రావాల్సిన పరిస్థితి ఉంది. పలుచోట్ల రోడ్లన్నీ వెలవెల బోతున్నాయి.