ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు

మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 30 : సుల్తానాబాద్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎల్లమ్మ తల్లి పట్నాలు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, గౌడ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.