తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్… మరో నాలుగు రోజులు ఇంతే…

మహా వెలుగు హైదరాబాద్ : రెండు మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న మరో నాలుగు రోజులు ఇలాగే ఉండనున్నట్టు వాతవరణ శాఖ వెల్లడించింది. ఎండలు తీవ్రం కావడంతో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రెండు నుండి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధరణం కంటే అధికం కానున్నట్టు వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించిన అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు

ఈ క్రమంలోనే ఎండలు తీవ్రం అయిన నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా గడిచిన ఇరవైనాలుగు గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ క్రమలోనే ఉత్తర తెలంగాణ జిల్లాలోతోపాటు దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదంటూ సూచించారు. ఎండ నుండి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు కూడ తీసుకోవాలని చెప్పారు.
ముఖ్యంగా కోవిడ్ బాధితులతో పాటు సామాన్య ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యరంగ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అకస్మాత్తుగా పెరిగే ఎండల వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించారు. ముఖ్యంగా గతంలో కోవిడ్ భారిన పడిన వారు తగు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోని అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య నిపుణులు సూచించారు.

మరోవైపు ఎండల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ల సమయాలను కూడా తగ్గించింది. వారం రోజుల పాటు స్కూళ్ల సమయాన్ని తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు.. దీంతో నేటి నుండే.. ఉదయం 8 గంటల నుండి 11.30 గంటల వరకు మాత్రమే స్కూళ్లు కొనసాగనున్నట్టు చెప్పారు.