మహా వెలుగు రామగుండము 31: కరోనా వలన చనిపోయిన పోలీస్ కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం ను మానవతా దృక్పథంతో ‘మ్యాన్‌కైండ్ ఫార్మా’ వారు అందిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి ఐపిఎస్,(ఐజీ), పేర్కొన్నారు. శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహస్తూ కరోనా బారిన పడి ప్రాణత్యాగం చేసిన ఫ్రంట్‌లైన్ యోధడు హెడ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్ కుటుంబానికి రూ. 3 లక్షల చెక్కును రామగుండం సీపీ చంద్రశేఖరరెడ్డి ఐపిఎస్,(ఐజీ), చేతుల మీదుగా ‘మాన్‌కైండ్ ఫార్మా ‘ డివిజనల్ రిజనల్ మేనేజర్ భగవాన్ రెడ్డి, ఏరియా మేనేజర్ తిరుమలేష్, కంపెనీ ప్రతినిధులు దాసరి శ్రీనివాస్, అంజనీ కుమార్, జితేందర్, శంకర్ & బృందం సమక్షంలో కుటుంబానికి అందజేశారు. ఈ సందర్బంగా రామగుండం సీపీ మాట్లాడుతూ… మ్యాన్‌కైండ్ ఫార్మా చూపిన చొరవ మానవత్వంకి ప్రతీక అని, పోలీస్ అమరవీరుల త్యాగాలని స్మరిస్తూ వారి కుటుంబలకు చేస్తున్న దాతృత్వాన్ని సీపీ అభినందించారు.
మ్యాన్‌కైండ్ ఫార్మా ప్రతినిధులు మాట్లాడుతూ… కరోనా మహమ్మారిపై పోరాడి ప్రజలను కాపాడుతూ ఎంతో మంది యోధులు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళిగా, ఈ కోల్పోయిన యోధుల కుటుంబాలను ఆదుకోవడానికి ఒక బాధ్యతాయుతమైన సంస్థగా, మ్యాన్‌కైండ్ ఫార్మా ఈ హీరోల కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు.