మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 31 : కృషి కల్చరల్ ఆర్ట్స్ సంస్థ స్థాపించి ఇరవై సంవత్సరాలు గడుస్తున్న
సందర్భంగా ఏప్రిల్ 27న హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న ద్విదశాబ్ది ఉత్సవాల పోస్టర్ ను బుధవారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. రామగుండం నియోజకవర్గం కళలకు,
కళాకారులకు పెట్టింది పేరు అని, ఇక్కడి కళాకారులు దేశ విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చిన చరిత్ర ఉన్నదని గుర్తుచేశారు. ఇరవై సంవత్సరాలుగా కృషి కల్చరల్ ఆర్ట్స్ చేస్తున్న కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావుతో పాటు కృషి కల్చరల్ ఆర్ట్స్ అధ్యక్షులు కాసిపాక రాజమౌళి, ప్రధానకార్యదర్శి కనకం రమణయ్య, కోశాధికారి సిరిపురం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి బీరుక లక్ష్మణ్, సీనియర్ కళాకారులు బోడకుంట వెంకట్రాజం, నిట్టూరి రాజు తదితరులు పాల్గొన్నారు.