మహా వెలుగు రామగుండము 31: సౌత్ ఇండియా యూనివర్సిటీ చెస్ చాంపియన్ చెస్ పోటీకి గోదావరిఖనికి పారిశ్రామిక ప్రాంతానికి చెందిన తాడబోయిన అరుణ్ కుమార్ ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో ఐటి కోర్సు చదువుతున్నాడు.ఈ పోటీలు ఏప్రిల్ 1 నుండి 3 వరకు తమిళనాడు రాష్ట్రంలోని ఎస్. ఆర్. ఎం యూనివర్సిటీలో జరగనున్నవి . యూనివర్సిటీ స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ చూపి ఎంపిక కావడం పట్ల గురువారం కోచ్ కే కుమార్, యూనివర్సిటీ అధ్యాపక బృందం, పలువురు క్రీడాభిమానులు అభినందించారు.