అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాలు : పాల్గొన్న ఎమ్మెల్యే

మహా వెలుగు పెద్దపల్లి 31 : పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ పట్టణంలో గుడిమిట్టపల్లి, శాస్త్రినగర్ లలో గురువారం జరిగిన పోచమ్మ బోనాల వేడుకలలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఎంపీపీ బాలాజీ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్, డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు, మార్కెట్ ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు పారుపెల్లి గుణపతి, కౌన్సిలర్ కూకట్ల గోపి, జనగామ ప్రశాంత్ రావు, బోయిని రాజమల్లు, దీకొండ భూమేష్, ములుగురి అంజయ్య, విజేందర్, చంద్రయ్య, పోసాని ,శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు,
యాదవ కులస్తులు పాల్గొన్నారు.