మహా వెలుగు రామగుండము 02: గోదావరిఖని లోని ఎల్బీనగర్ లో రామగుండం కార్పొరేషన్ ఏరియా మాల మహానాడు నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అధ్యక్షులు గడ్డం నారాయణ, అధ్యక్షతన జరిగిన ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బడికిల రవి, గౌరవ అధ్యక్షులు ఎరుకల పోచయ్య, కొప్పుల మల్లేష్, గాదం మల్లేష్, హర్ష మల్లేష్, గోదా ఆగయ్య, పూసల బాబు, సుద్దాల అనురాజ్, బండ రాజు పాల్గొన్నారు. అనంతరం సింగరేణి పదవీ విరమణ పొందిన అర్థ రాజమల్లు ని మాల మహానాడు నూతన కార్యాలయంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గడ్డం నారాయణ మాట్లాడుతూ.. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 50డివిజన్ లలో ఉన్న ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ సంతోషకరమైన జీవితం పొందాలని శుభ కృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాలమహానాడు నూతన కమిటీ మరియు సంఘం అభివృద్ధి కొరకు కుల సభ్యులు సహకరించి అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
