మహా వెలుగు రామగుండము 02: గోదావరిఖనికి చెందిన ప్రముఖ ఇంద్రజాలికులు మ్యాజిక్ రాజాను హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలువురు ప్రముఖులు గజమాలతో ఘనంగా సన్మానించారు. గత సంవత్సరం నల్గొండకు చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు రామకృష్ణ కళ్ళకు గంతలతో మోటార్ సైకిల్ పై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ సందేశ్ యాత్ర చేసి సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్కే వండర్ వరల్డ్, హైదరాబాద్ మెజీషియన్స్, తెలుగు మెజీషియన్స్, వియం హోం వాకర్స్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజీషియన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా మేజిక్ రాజా హాజరయ్యారు. రామకృష్ణ సందేశ్ యాత్రకు సహకరించిన వారిని, ఇంద్రజాల రంగానికి విశిష్ట సేవలందించిన సీనియర్ మెజీషియన్లను సన్మానించడంలో భాగంగా మాజీమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, అవినాష్ గ్రూప్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అవినాష్ బ్రహ్మదేవర, ఇంద్రజాలికులు జి రామకృష్ణ, మేజిక్ రాజాను గజమాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేసారు. ఈ సందర్భంగా శనివారం ఖనిలో పలువురు మేజిక్ రాజా ను అభినందించారు.
