సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి

మహా వెలుగు,భీమారo : సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ,సీసీ కెమెరాలు ఆసాంఘిక కార్యక్రమాలు గుర్తించెందుకు ఎంతో సహకరిస్థాయని భీమారo ఎస్ఐ అశోక్ పేర్కొన్నారు. భీమారo మండల కేంద్రంలోని ఆవుడం క్రాస్ రోడ్డు సమీపంలో దుకాణం దారులతో ,పాటు కాంప్లెక్స్ ఓనర్లతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలు, అరికట్టడమే కాక రోడ్డు ప్రమాదంలు ,మిస్సింగ్ లు ,ప్రజల భద్రత కు ఎంతో సహకరిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది నసాని రవి , జర్పుల రాజ్ కుమార్ నాయక్ , దాసరి మణిదీపక్ , విరాగోని రమేష్ ,ప్రణీత్ గౌడ్ , రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.