మహా నీయులు బాబు జగజ్జీవన్


మహా వెలుగు మంథని : మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాబు జగజీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.