రామారావు పేట గోదారి నదిలో గుర్తుతెలియని మృత దేహం

మహా వెలుగు, జైపూర్ : మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామారావుపేట గ్రామ శివారులో గల గోదావరి నదిలో గుర్తుతెలియని మగ మనిషి మృతదేహం లభ్యం అయినట్లు జైపూర్ ఎస్ఐ రామ కృష్ణ తెలిపారు. మొఖము గుర్తుపట్టని విధంగా ఉండి గోదావరి నది ఒడ్డునకు కొట్టుకొని వచ్చి గోదావరి ఒడ్డున కనిపించిందని వారు తెలిపారు. ఆనవాళ్ళు గుండ్రటి మొహం కలిగి, వయస్సు అందాద 55 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉండి, ఎత్తు 5.6 అడుగుల గలడు, శరీరంపై ఎరుపు నలుపు నీలిరంగు కలిగిన చెక్స్ షర్ట్ మరియు ముదురు నషం రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని. మృతదేహం ఆచూకీ తెలిసినవారు జైపూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారము అందించగలరని వారు తెలిపారు
వివరాలకు ఎస్ఐ రామకృష్ణ 9440795046, 99633 07107 పైన ఫోన్ నoబర్లకు తెలిపగలరన్నారు