మైకు నాదంటే నాది
వరి దీక్షలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

మహా వెలుగు, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాద్ జిల్లా కేంద్రంలో యాసంగి వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పాలకులు చేస్తున్న దీక్షలో ఈరోజు ప్రోటోకాల్ నీ ప్రక్కన పెట్టి మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత మాట్లాడుతున్న సందర్భంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొదట నేను మొదట నేనే మాట్లాడాలని mp చేతిలో ఉన్నటువంటి మైకును దురుసుగా గుంజుకున్నా సందర్భం.
ఎంపీ మాలోత్ కవిత శంకర్ నాయక్ ను వారించినా కూడా తన మొండి పట్టు విడవకుండా మైకును లాగేసుకున్నారు.మాలోత్ కవిత మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులే కాకుండా ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.