ఆ టీచర్ ను సస్పెండ్ చేయండి

మహా వెలుగు,డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా మండలం, బూర్గుపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో 4 ఏళ్ల చిన్నారి వాసవి చేతిపై గరిటతో వాత పెట్టిన అంగన్ వాడి టీచర్ హైమవతిని సస్పెండ్ చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఆదేశాలు ఇచ్చారు
పాప చేతిపై వేడి గరిటతో వాత పెట్టడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. దీని మీద విచారణకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంగన్వాడీలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నతాధికారులకు సూచించారు
పాపకు మెరుగైన వైద్యం అందించాలన్నారు