మహా వెలుగు,రామగుండము 08: సింగరేణి కార్మికుల సమస్యలపై ఈ నెల 13న అన్ని జియం కార్యాలయాల ముందు నిరాహారదీక్షలు చేయనున్నట్టు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి, జెబిసిసిఐ సభ్యులు, మందా నర్సింహారావు అన్నారు. జిడికె1ఇంక్లైన్ లో జరిగిన, గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో అనేక సమస్యలు పేరుకు పోయాయని గుర్తింపు సంఘం పైరవిలకు పరిమితం అయ్యిందని కార్మికుల సమస్యలు పరిష్కరించే పరిస్తిలో లేదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ1 అధ్యక్షులు మెదరి సారయ్య, సెక్రెటరీ మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, అన్నం శ్రీనివాస్, ఇప్పలపల్లి సతీష్, పిట్ సెక్రటరీ డి సురేష్, జి సాయి కృష్ణ, ఈ సాగర్, బి బాలరాజు, ఐ రమేష్, కె రమేష్, పి శేషికిరన్, కే శ్రావణ్, టి సురేష్, జి ప్రవీణ్, సిహెచ్ సతీష్, జి రామ్ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
