బావిలో పడి ఆటోడ్రైవర్ మృతి

మహా వెలుగు పెద్దపల్లి 08 : గోదావరిఖని గాంధీ నగర్ కు చెందిన అహ్మద్ ఆటో డ్రైవర్ ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలోని బావిలో పడి మరణించాడు. గతంలో రెండు సార్లు మద్యం మత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.