- ఈ ఫ్యాక్టరీ తో మన పిల్లలకు డైరెక్ట్ గా 500 మందికి ఇండైరెక్టుగా 1700 వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు
- భీమారం లో మూడు లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి
- ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
మహా వెలుగు,చెన్నూర్ : 150 కోట్లతో చెన్నూరు నియోజవర్గంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని , ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో
ఈ ఫ్యాక్టరీ తో మన పిల్లలకు డైరెక్ట్ గా 500 మందికి ఇండైరెక్టుగా 1700 వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.
చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం చిర్రకుంట గ్రామంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కోఆర్డినేటర్ అత్తి సరోజ వ్యవసాయ క్షేత్రంలో 30 ఎకరాల్లో సాగు చేయనున్న ఆయిల్ పామ్ తోటలో శుక్రవారం మొక్కలు నాటారు. సందర్భంగా వారు మాట్లాడారు. భీమారం మండలం లోని మద్దికల్ గ్రామంలో 71 ఎకరాల్లో ఎనిమిది లక్షల మొక్కలు ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. మెగా నర్సరీ ఏర్పాటు చేసి 8 లక్షల మొక్కలు పెంచనున్నట్లు వారు తెలిపారు. రానున్న ఖరీఫ్ సీజన్ వరకు నియోజవర్గంలో 3500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు పెట్టెల చూడాలని వారు సూచించారు.
ఆయిల్ పామ్ 30 సంవత్సరాల వరకు ఉంటుందని రైతులకు ఎలాంటి డోకా లేదని వారు తెలిపారు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలలో మ్యాట్రిక్స్ కంపెనీ తీసుకుందని వారే మొక్కలు పంపిణీ చేస్తారని వారు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ మొక్కల పెంపకం ప్రతి ఒక్కరు పెట్టాలని వారు సూచించారు. రాష్ట్రంలో ఇరవై ఐదు జిల్లాల్లో ఆయిల్ పామ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ , ఎంపీపీ, జడ్పిటిసి, స్థానిక సర్పంచ్, DAO,ADA, AOD,AEO,మ్యాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.
