మహా వెలుగు రామగుండo ఏప్రిల్ 08: రామగుండం శుక్రవారం ఏరియా1 ఇల్లందు క్లబ్ లో సింగరేణి జిఎం సేఫ్టీ కె గురువయ్య అధ్యక్షతన, జిఎం ఆర్జి1 కె నారాయణ పర్యవేక్షణ లో రక్షణ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభాత్ కుమార్ (ఇన్స్ పెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ), ధన్ బాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో కోల్ ఇండియాతో పోల్చినపుడు సింగరేణిలో తరచుగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఇందుకు గల కారణాలు ఆడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో జరిగిన ఫ్యాటల్ యాక్సిడెంట్ ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి, ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అండర్ (గౌండ్, ఓపెన్ కాస్ట్ గనులలో అన్ని రక్షణ చర్యలు పాటించాలని ముఖ్యంగా మెషినరీ విషయంలో నూతన సాంకేతిక మెరుగుపరచడానికి కావాల్సిన అధ్యయనం చేయాలని తెలిపారు.
అదే విధంగా రూఫ్ లేదా సైడ్ ఫాల్ అయినపుడు అందులో చిక్కుకుపోయిన ఉద్యోగులను గుర్తించటానికి రేడియో ఫ్రీక్వెన్స్ ఐడెంటిఫికేషన్స్ విధానాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ యూనియన్ నాయకులు గనుల యొక్క పనితీరు మరియు రక్షణపై తీసుకోవాల్సిన చర్యలు, సలహాలు జాగ్రత్తలపై వివరించారు. భూగర్భ గనులలో రక్షణ పట్ల నూతన టెక్నాలజీని మెరుగుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీజీఎంఎస్ మాలై టికేదార్, జీఎం సిపిపి నాగభూషణ్ రెడ్డి , జీఎం ఆర్ & డి సుభాని, డియంయస్ అధికారులు టి శ్రీనివాస్ , శ్యామ్ మిశ్రా , సుప్రియా చక్రవర్తి , ఎస్ ఎస్ సోనీ, అన్నీ గుర్తింపు సంఘం ప్రతినిధులు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, ఏజంట్లు, మేనేజర్లు, ఏరియా సేఫ్టీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
